Dharmavaram: ధర్మవరంలో ఆధునిక అగ్నిమాపక వాహనం ప్రారంభించిన మంత్రి
Dharmavaram: ధర్మవరంలో 5000 లీటర్ల సామర్థ్యంతో ఆధునిక అగ్నిమాపక వాహనాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు.
Dharmavaram
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా అందిన అడ్వాన్స్ వాటర్ టెండర్ వాహనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు.
ఈ వాహనం 5,000 లీటర్ల నీటి సామర్థ్యంతో పాటు అత్యాధునిక రెస్క్యూ, భద్రతా మరియు కమ్యూనికేషన్ పరికరాలతో సన్నద్ధంగా ఉంది. సుమారు రూ.74.75 లక్షల వ్యయంతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఆధునిక వాహనం ద్వారా అగ్నిప్రమాదాల సమయంలో వేగవంతమైన స్పందన అందించడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులను మరింత సమర్థంగా రక్షించగల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
Next Story




