Amaravati: పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి పోతిన హనుమంతరావు!
Amaravati: నూతన పింఛన్ల దరఖాస్తు గడువు మరో 10 రోజులు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు పోతిన హనుమంతరావు డిమాండ్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Amaravati: పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి పోతిన హనుమంతరావు!
Amaravati: పింఛన్ల దరఖాస్తుల సమయం పెంచాలి - పోతిన హనుమంతరావు డిమాండ్ ఎన్నికల సమయం వేల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై మమకారం పుట్టుకొచ్చిందని రెండేళ్లపాటు నూతన పింఛన్లు విడుదల చేయని కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే విడుదల చేసిందని రాష్ట్ర వైసిపి SEC సభ్యులు పొతిన హనుమంతరావు విమర్శించారు.
లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు పది రోజులు సమయం సరిపోదని అందులో మూడు రోజులు సెలవు దినాలకి పోతుందని పేర్కొన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో 10 పది రోజులు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఐదు నుంచి పది రోజులు సమయం పడుతుందని దీని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తు సమయం పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ కోసమే చంద్రబాబు ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందని దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే గట్టి బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికైనా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుల సమయం పెంచాలని డిమాండ్ చేశారు.




