Amaravathi: ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు, పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక!

Amaravathi: ఏపీలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు.. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు, పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల సంస్థ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 12 Sept 2026 1:01 PM IST
Amaravathi
X

Amaravathi: ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు, పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక!

Amaravathi: దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ జిల్లాల్లో వర్షాల ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు, బలమైన గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI