Amaravati: జనసేనానికి రాజీనామా పత్రం సమర్పించిన శ్రీధర్.. ఆరోపణలపై వివరణ!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. శాసనసభ విప్ పదవికి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 May 2026 4:42 PM IST
Amaravati
X

Amaravati: జనసేనానికి రాజీనామా పత్రం సమర్పించిన శ్రీధర్.. ఆరోపణలపై వివరణ!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, శాసనసభ విప్‌గా కొనసాగుతున్న అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా అందజేశారు.

జనసేన వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరవ శ్రీధర్ తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలే కారణమని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు, చర్చకు వచ్చిన వివాదాలపై కూడా పవన్ కళ్యాణ్‌కు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ వివాదాల స్వరూపం ఏమిటి, పార్టీ స్థాయిలో వాటిపై ఎలాంటి చర్చ జరిగింది అన్న అంశాలపై అధికారికంగా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్‌తో సమావేశం అనంతరం ఆరవ శ్రీధర్ మరో కీలక భేటీ కూడా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తో కూడా ఆయన సమావేశమైనట్లు సమాచారం. ఈ వరుస భేటీలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి...ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే. సమావేశాల అనంతరం ఆరవ శ్రీధర్ మీడియా ముందుకు రాకుండా వెళ్లిపోవడం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నాయకులు మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. సచివాలయం బ్లాక్-2 వద్ద మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తున్న సమయంలో, ప్రధాన ద్వారం ద్వారా కాకుండా మరో మార్గం ద్వారా ఆయన బయటకు వెళ్ళిపోయారు.

మరోవైపు జనసేన పార్టీ ఇప్పటివరకు ఈ అంశంపై అదనపు వివరణ ఇవ్వలేదు. రాజీనామా ఆమోదం, తదుపరి చర్యలు, కొత్త విప్ ఎంపిక వంటి అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామంపై మరిన్ని వివరాలు బయటకు వస్తాయా? లేక ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయంగానే ముగుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story