CM Chandrababu: డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్

CM Chandrababu: స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం కోసం ఆంధ్రప్రదేశ్ 15% వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 May 2026 5:44 PM IST
CM Chandrababu
X

CM Chandrababu: డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్

CM Chandrababu: రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థలో సామర్థ్య పెంపు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోవాలంటే రాష్ట్రం కనీసం 15 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుందని, అందుకు గణాంకాల సేకరణ వేగవంతం కావాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో ప్రణాళిక శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

*ప్రతి నెలా ఆర్థిక గణాంకాల సేకరణ*

రియల్‌టైమ్ జీఎస్డీపీ అంచనాలపై సీఎం ఆదేశాలు ప్రస్తుతం జీఎస్డీపీ అంచనాలు త్రైమాసికం, వార్షిక ప్రాతిపదికన రూపొందుతున్నాయని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. పాత గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధి వేగం తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి మండలంలో ఆర్థిక కార్యకలాపాలను నెలనెలా ట్రాక్ చేసే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

*మండల స్థాయి వరకు మూడు నెలల శిక్షణ*

ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులకు ప్రత్యేక ట్రైనింగ్ జీఎస్డీపీ అంచనాల విధానాన్ని అధికారులకు సులభంగా అర్థమయ్యేలా చేసి, రియల్‌టైమ్ మానిటరింగ్‌కు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జోన్లు, 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మూడు నెలలపాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లు, జోనల్ మరియు జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

*ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణకు ప్రాధాన్యం*

వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలపై ప్రత్యేక ఫోకస్రా,ష్ట్రంలో త్వరలోనే పూర్తి స్థాయి డేటా డ్రివెన్ గవర్నెన్స్ అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.ఇప్పటి వరకు ట్రాక్ చేయని సూచికలను కూడా గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులను వేగంగా గుర్తించి, వెంటనే విధాన నిర్ణయాలు తీసుకునేలా సాంకేతికతను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

*కేపీఐల ఆడిటింగ్‌తో పారదర్శకత*

ఫలితాల ఆధారిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేపీఐల ఆడిటింగ్ వ్యవస్థను ప్రభుత్వ పనితీరుతో అనుసంధానం చేయాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి శాఖ పనితీరును కొలిచే సూచికలను సమర్థవంతంగా ఉపయోగిస్తే అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఫలితాల ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story