Amaravati: వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో బ్రదర్ సిరాజ్ మర్యాదపూర్వక భేటీ!

Amaravati: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్. చైర్మన్ పదవికి అబ్దుల్ అజీజ్ పూర్తి న్యాయం చేస్తున్నారని ప్రశంస.

A Praveen, Nellore
Published on: 31 Aug 2026 11:15 AM IST
Amaravati
X

Amaravati: వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో బ్రదర్ సిరాజ్ మర్యాదపూర్వక భేటీ!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్‌ను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రదర్ సిరాజ్ మాట్లాడుతూ ఇప్పటివరకు వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా వచ్చిన వారు ఈ పదవిని హోదాగా భావించారు.

తప్ప, బాధ్యతగా భావించలేదు. మొట్టమొదటిసారిగా అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఒక బాధ్యతగా భావించి పనిచేస్తున్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా సమాజానికి ఎంతగా ఉపయోగపడవచ్చో తన కార్యాచరణతో నిరూపిస్తున్నారు అని ప్రశంసించారు.

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి, వక్ఫ్ సంస్థల బలోపేతం కోసం అబ్దుల్ అజీజ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని సిరాజ్ పేర్కొన్నారు. చైర్మన్ పదవి కేవలం హోదా కాదు.. సమాజం పట్ల ఉన్న బాధ్యత అని అబ్దుల్ అజీజ్ తాలిం ఏ హునర్, తన పనితీరు ద్వారా నిరూపిస్తున్నారని ఆయన అన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story