Amaravati: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరో రెండ్రోజుల్లో జల్లులు!
Amaravati: నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత. నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
Amaravati: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరో రెండ్రోజుల్లో జల్లులు!
Amaravati: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నెల్లూరులో అత్యధికంగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
దీంతో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో రెండు రోజుల తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. దీంతో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Next Story




