Amaravathi: సెప్టెంబర్ 1 నుంచే 61.92 లక్షల మందికి పింఛన్ల పంపిణీ!

Amaravathi: సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల. 61.92 లక్షల మందికి లబ్ధి: మంత్రి కొండపల్లి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 30 Aug 2026 12:26 PM IST
Amaravathi
X

Amaravathi: సెప్టెంబర్ 1 నుంచే 61.92 లక్షల మందికి పింఛన్ల పంపిణీ!

Amaravathi: రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌ర్‌ నెలలో 61,92,396 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

సెప్టెంబ‌ర్‌ 1వ తేదీ ఉద‌యం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామ‌ని... కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు (Spouse Pensions) సెప్టెంబ‌ర్‌ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2.51 కోట్లను విడుదల చేసిన‌ట్టు కూడా మంత్రి తెలిపారు.

భర్త మరణించిన అనంతరం అర్హత కలిగిన జీవిత భాగస్వామి కి సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పింఛన్ల కోసం ఈ నెల విడుద‌ల చేసిన నిధుల‌తో క‌లుపుకుని రూ.73,506 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింద‌న్నారు.

నిరుపేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పింఛన్‌ నిధుల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల‌కు అందిస్తోంద‌ని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story