Amaravati: అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకలు.. జిల్లాల్లో మంత్రుల జాతీయ పతాక ఆవిష్కరణ!

Amaravati: ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు, జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 Aug 2026 6:43 PM IST
Amaravati
X

Amaravati: అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకలు.. జిల్లాల్లో మంత్రుల జాతీయ పతాక ఆవిష్కరణ!

అమరావతి: అమరావతిలో ఉదయం 8.30 గంటలకు ప్రధాన వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇక జిల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి నారా లోకేశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర, పల్నాడులో నాదెండ్ల మనోహర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ, అనకాపల్లిలో వంగలపూడి అనిత, చిత్తూరులో సత్యకుమార్ యాదవ్, పశ్చిమగోదావరిలో నిమ్మల రామానాయుడు పతాకావిష్కరణ చేయనున్నారు.

అలాగే విశాఖపట్నంలో అనగాని సత్యప్రసాద్, తిరుపతిలో ఆనం రామనారాయణరెడ్డి, అనంతపురంలో పయ్యావుల కేశవ్, కర్నూలులో టీజీ భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

ఒకవైపు రాజధాని అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకలు.. మరోవైపు జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో జరిగే కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవానికి పండుగ వాతావరణం నెలకొననుంది. జాతీయ జెండా.. దేశభక్తి నినాదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. పోలీసు పరేడ్‌తో ఆగస్టు 15న ఏపీ మువ్వన్నెల పండుగను ఘనంగా జరుపుకోనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story