Amaravati: ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాలకు హై అలర్ట్!
Amaravati: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన.
Amaravati: ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాలకు హై అలర్ట్!
Amaravati: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అటు తెలంగాణలో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుంది.




