Amaravati: వినాయక చవితి వేడుకలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఎక్స్ వేదికగా వివరాలను వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.
Amaravati: వినాయక చవితి వేడుకలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్!
Amaravati: వినాయకుడి భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ సమూహాలు నిర్వహించే వినాయక చవితి వేడుకలు విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించడంలో భాగంగానే.. పందిళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వినాయక మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గనుంది.




