వినాయక చవితి వేడుకలకు పటిష్ట భద్రత..హోం మంత్రి వంగల పూడి అనిత....
Amaravati: వినాయక చవితి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో, ఉచిత విద్యుత్ సదుపాయం కల్పన.
వినాయక చవితి వేడుకలకు పటిష్ట భద్రత..హోం మంత్రి వంగల పూడి అనిత....
అమరావతి: వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. మండపాల అనుమతుల కోసం Single Window Clearance System అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిర్వాహకులకు అనవసరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది.
అదేవిధంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే భక్తులు, ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు ఈ సౌకర్యాలు మరింత వెసులుబాటు కల్పించనున్నాయి. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ, పండుగ వేడుకలు సజావుగా జరిగేలా ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది.
మరోవైపు వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండపాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జనం సందర్భంగా రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణ వంటి అంశాలపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
పండుగ వేళ ప్రజల భద్రత కోసం కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించే ప్రతి పోలీస్ సోదరుడికి, సోదరికి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలంతా పోలీసులకు సహకరిస్తూ, నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించాలని విజ్ఞప్తి.
ప్రజల సహకారంతో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకుందాం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...




