Amaravati: శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజుపై భూకబ్జా ఆరోపణలు!

Amaravati: వైసీపీకి చెందిన శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు తన 36 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుడు ఏలూరి రంగబాబు అమరావతిలో ఆరోపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Aug 2026 4:41 PM IST
Amaravati
X

Amaravati: శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజుపై భూకబ్జా ఆరోపణలు!

Amaravati: కృష్ణాజిల్లా కృత్తివేన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామం చెందిన ఏలూరి రంగబాబు కు చెందిన 36 ఎకరాల భూములను అక్రమంగా ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కోయె మోషే రాజు ఉండి , నర్సాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా స్టాంప్ అండ్ డ్యూటీ ఐ జీ కార్యాలయంలో కమిషనర్ కి అర్జీలు ఇచ్చినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు..

గత 8 నెలలు నుండి ప్రభుత్వ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని తెలిపారు.

ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ శాసనమండలి చైర్మన్ మోషే రాజు మేనేజ్ చేస్తున్నారు,

కావున శాసనమండలి చైర్మన్ మోసే రాజు పై ప్రభుత్వం ఎంక్వయిరీ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

మా భూముల విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆదేశాలతో ఇప్పటివరకు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మాత్రమే నలుగురు సబరిజిస్తులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది..

తమ భూములపై తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story