Adilabad: చేనుకు వెళ్లి ఇంటికి రాని యువకుడు బావిలో మృతదేహం లభ్యం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామంలో శోకసంద్రం. చేనుకు వెళ్లిన యువకుడు సూరం ఆదర్శ్ (20) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి.

NAGULA SATISH, BOATH
Published on: 23 Aug 2026 1:39 PM IST
Adilabad
X

Adilabad: చేనుకు వెళ్లి ఇంటికి రాని యువకుడు బావిలో మృతదేహం లభ్యం!

Adilabad: ​గుడిహత్నూర్ మండలంలోని గురుజ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లిన సూరం ఆదర్శ్ (20) అనే యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

​ఎప్పటిలాగే నిన్న ఉదయం వ్యవసాయ పనుల కోసం చేనుకు వెళ్లిన ఆదర్శ్, సాయంత్రమైనా ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చేను వద్దకు వెళ్లి వెతికారు. అక్కడ వ్యవసాయ బావి నీటిపై ఆదర్శ్ చెప్పులు తేలుతూ కనిపించడంతో తీవ్ర భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చీకటి పడటంతో సహాయక చర్యలు చేపట్టడం సాధ్యపడలేదు.

​ఈ రోజు ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో, మోటార్లతో బావిలోని నీటిని తోడించి ఆదర్శ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆదర్శ్‌కు ఈత రాకపోవడంతో కాలుజారి ప్రమాదవశాత్తు బావిలో పడి మునిగిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story