Adilabad: దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలి: యోగానంద సరస్వతి
Adilabad: భారతదేశంలో గోహత్యను నిషేధించాలని, గోమాతను 'రాష్ట్ర మాత'గా ప్రకటించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద మఠాధిపతి యోగానంద సరస్వతి డిమాండ్ చేశారు.
Adilabad: దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలి: యోగానంద సరస్వతి
ఆదిలాబాద్: సంపూర్ణ భారతదేశంలో గోహత్యను నిషేధించాలని మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు.
గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని గోమాత సన్మాన ఆహ్వాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో సంకీర్తనలతో ర్యాలీ నిర్వహించి.. అనంతరం కలెక్టరేట్ వద్ద అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ.. గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సకల దేవతల ఆశీర్వాదం కావాలంటే గోరక్షణ ఎంతో అవసరం అన్నారు.
గోవద నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు
Next Story




