Nirmal: నిర్మల్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం!

Nirmal: నిర్మల్‌లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. మృతి చెందిన ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని జిల్లా యూనియన్ డిమాండ్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 19 Aug 2026 1:40 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యూనియన్, కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ ఫోటో వృత్తిలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించి ఆదుకోవాలన్నారు. అదే విధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి స్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుమ్మరి శేఖర్, సంఘ ప్రతినిధులు సగం వంశీ, మంద లోకేష్, వినయ్, కేంద్రే రామ్ రాజ్, గంగాధర్, అయిట్ల ప్రవీణ్, సిహెచ్ శ్రీనివాస్, రమేష్, గంగాధర్, రామ్ రమేష్, ఉత్తూరి పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story