Gudihatnur: రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా శైలేందర్
Gudihatnur: తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన వాఘ్మరే శైలేందర్ నియామకం. నియామక పత్రం అందజేసిన క్రాంతి కిరణ్.
Gudihatnur: రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా శైలేందర్
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వాఘ్మరే శైలేందర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ క్రాంతి కిరణ్ గారి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా శైలేందర్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఎంపీ శ్రీ గోడం నగేష్, ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పతంగే బ్రహ్మానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గటిక క్రాంతి కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అశోక్ ముస్తాపురే గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ పటిష్టతకు, ఎస్సీ సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గుడిహత్నూర్ మండలలోని లింగాపూర్ వాసికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.




