Nirmal: బైంసా, లోకేశ్వరం మండలాల్లో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు!

Nirmal: నిర్మల్ జిల్లా బైంసా, లోకేశ్వరం మండలాల్లోని రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 25 Aug 2026 8:30 PM IST
Nirmal
X

Nirmal: బైంసా, లోకేశ్వరం మండలాల్లో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు!

నిర్మల్ జిల్లా: బైంసా మండలం దేగం శివారులోని శ్రీరామ రైస్‌ మిల్లులో 2022–23 సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్యాడి పై అధికారులు తనిఖీలు చేపట్టారు.మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 5,922 మెట్రిక్‌ టన్నులు ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో కేవలం 716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

ఈ లోటు విలువ సుమారు రూ.11.64 కోట్లుగా పేర్కొన్నారు.మరో పక్క లోకేశ్వరం మండలం పుస్పూర్ శివారులోని సీతారామ రైస్‌ ఇండస్ట్రీస్‌లోనూ భారీ లోటు గుర్తించారు. ఈ మిల్లుకు యాక్షన్ ప్యాడి కింద 6,306 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించగా,తనిఖీల్లో మిల్లులో కేవలం 25,575 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

దీంతో సుమారు రూ.14.10 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం.రైస్‌ మిల్లుల్లో నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను సివిల్‌ సప్లైస్‌ అధికారులకు అందజేయనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story