Nirmal: సాత్గాం సాయి రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు!
Nirmal: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సాత్గాం శ్రీ సాయి రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. 23 వేల క్వింటాళ్ల ధాన్యం వ్యత్యాసం, పీడీఎస్ బియ్యం వాహనం సీజ్.
Nirmal: సాత్గాం సాయి రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు!
Nirmal: లోకేశ్వరం మండలం సాత్గాం గ్రామ శివారులోని శ్రీ సాయి రైస్ మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.ఎన్ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఓ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందం మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్‌లోని సాయి బాలాజీ రైస్ మిల్లుపై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.సాయి బాలాజీ రైస్ మిల్లును గతంలోనే అధికారులు సీజ్ చేయగా,దాని యజమాని ఇతర రైస్ మిల్లులకు పీడీఎస్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 564 బస్తాలపై సాత్గాం శ్రీ సాయి రైస్ మిల్ స్టెన్సిల్స్,స్లిప్స్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు.దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు సాత్గాం సాయి రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా,రికార్డులకు, బియ్యం నిల్వలకు పొంతన లేదని గుర్తించారు.దాదాపు 23 వేల క్వింటాళ్ల మేర ధాన్యం తేడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ తేడా 2022 రబీ, 2023 ఖరీఫ్,2024 రబీ సీజన్లకు సంబంధించినదిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రైస్ మిల్లుకు ధాన్యం కేటాయింపులు లేవని తెలిపారు.మరోవైపు రైస్ మిల్లు వద్ద 289 పీడీఎస్ బియ్యం బ్యాగులతో ఉన్న ఐచర్ వాహనాన్ని గుర్తించిన పోలీసులు,వాహనంతో పాటు బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.రికార్డులు,నిల్వలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తూ తదుపరి చర్యలకు వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.




