Utnoor: ఐటీడీఏ ముట్టడించిన ఆదివాసీలు జై ఆదివాసీ నినాదాలతో మార్మోగిన గూడెం
Utnoor: ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడించిన ఆదివాసీలు. లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ, కొమరం భీం సేన ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన.
Utnoor: ఐటీడీఏ ముట్టడించిన ఆదివాసీలు జై ఆదివాసీ నినాదాలతో మార్మోగిన గూడెం
ఉట్నూర్: ఉట్నూర్ ఐడీటీఏ వద్ద ఆదివాసీల మార్చ్ ప్రారంభమైంది. కొమురం భీం ప్రాంగణం నుంచి ర్యాలీ ప్రారంభమై అంబెడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా ఐటీడీఏ వరకు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ఆదివాసీలు తరలిరావడంతో జై ఆదివాసీ నినాదాలతో ఉట్నూర్ మారుమోగింది.
పోలీసులు సైతం భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండగా, ఐటీడీఏ ప్రాంతంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశారు.
లంబడాలను ఎస్టి జాబితా నుంచి తొలగించాలని, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలోని నిరుద్యోగ ఆదివాసి యువతకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, కొమరం భీం సేనాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు..




