Utnoor: ఆదివాసీల ఆందోళన – ఐటీడీఏ ముట్టడి, భారీ ర్యాలీ
Utnoor: తుడుందెబ్బ పిలుపు మేరకు ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 1/70 మరియు పెసా చట్టాలను అమలు చేయాలని డిమాండ్.
Utnoor: ఆదివాసీల ఆందోళన – ఐటీడీఏ ముట్టడి, భారీ ర్యాలీ
ఉట్నూర్: తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హలో ఆదివాసీ ఛలో ఉట్నూర్ ITDA ముట్టడి కార్యక్రమం నిర్వహించారు...చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి దాని కోసం కమిషన్ నియమించాలని, సుప్రీంకోర్టులో 1/70, చట్టాన్ని సవరించాలని,కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వామే పిటిషన్ వేయాలని,ఏజెన్సీ ప్రాంతంలో1/70,పెసా చట్టాలను పకడ్బందీగా అమలు తో పాటు
జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాలలో 75% రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలి,జీవో ఎంఎస్ నెంబర్ 3,ను యధావిధిగా కొనసాగించాల లని డిమాండ్తో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉట్నూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఐటిడిఏ వద్ద ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా తుడుం దెబ్బ ఆదివాసి సంఘ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ టైగర్ జోన్ పేరుతో ఆదివాసి గూడాలని తరలించే ప్రయత్నాలను ఫారెస్ట్ అధికారులు విరమించుకోవాలి.
బాపర్ ఏరియా కోర్ ఏరియా పేరుతో ఆదివాసులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళను ఫారెస్ట్ అధికారులు కట్టుకోకుండా అడ్డుకోవడం మానుకోవలం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బందోబస్తును పర్యవేక్షించారు.




