Gudihathnoor: గుడిహత్నూర్ X రోడ్డులో కూలిన భారీ వృక్షం..
Gudihathnoor: ఆదిలాబాద్ గుడిహత్నూర్ X రోడ్డులో భారీ వృక్షం కూలి ఉట్నూర్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Gudihathnoor: గుడిహత్నూర్ X రోడ్డులో కూలిన భారీ వృక్షం..
గుడిహత్నూర్ Xరోడ్డులో కూలిన భారీ వృక్షం: ఉట్నూర్ వైపు రాకపోకలకు ఆటంకం
గుడిహత్నూర్:
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని X రోడ్డు వద్ద ఉట్నూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గత రాత్రి ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా నెలకొరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుండి వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
ఉట్నూర్, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన రహదారి కావడం, పైగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
గంటల తరబడి చెట్టు రోడ్డుపైనే ఉన్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రయాణికులు, స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు




