Adilabad: తడోబాలో వైరల్ అయిన తల్లి పులి ప్రేమ!

Adilabad: మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్‌లో అద్భుతమైన దృశ్యం కెమెరాలో చిక్కింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 July 2026 11:20 AM IST
Adilabad
X

Adilabad: తడోబాలో వైరల్ అయిన తల్లి పులి ప్రేమ!

Adilabad: అదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్‌లో ఫారెస్ట్ లో పెద్ద పులుల సందడి పెరిగిపోయింది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని ఓ రహదారిపై ఆడ పులి తల్లి ప్రేమ అప్రమత్తతకు సంబంధించిన ఒక అద్భుతమైన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి..

తడోబా టైగర్ రిజర్వ్‌లో ప్రసిద్ధి చెందిన 'చిన్న మధు' అనే పులి మరోసారి వార్తల్లో నిలిచింది. తన పిల్లల పట్ల అది చూపిన ప్రేమ జాగ్రత్త ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహర్లీ మార్గంలో వెళ్తున్న ఒక పర్యాటకుని కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. 'చిన్న మధు' అనే పులి ముందుగా అడవి నుండి బయటకు వచ్చి, రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చాలా జాగ్రత్తగా చూస్తూ

వాహన రాకపోకలను గమనించి దారి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే, అది తన చిన్న పిల్లలను రోడ్డు దాటడానికి సంకేతం ఇస్తుంది. ఆ తర్వాత పిల్లలు దాని వెనుక సురక్షితంగా రోడ్డు దాటి దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story