Bellampalli: థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ టైక్వాండో పోటీలకు తెలంగాణ జట్టు!
Bellampalli: థాయ్‌లాండ్‌లో జరిగే టైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ జట్టు చెన్నై చేరింది. బెల్లంపల్లికి చెందిన ముగ్గురు క్రీడాకారులు భారత్ తరఫున ఆడనున్నారు.
Bellampalli: థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ టైక్వాండో పోటీలకు తెలంగాణ జట్టు!
థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ జట్టు
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి కి చెందిన వారు థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలో జరుగనున్న *9వ హీరోస్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ (WTF)*లో పాల్గొనేందుకు తెలంగాణ టైక్వాండో జట్టు చెన్నై చేరుకుంది. ఈ పోటీల్లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.
తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ జి. వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర అధ్యక్షుడు మూట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాస్టర్ కురువ శ్రీహరి, ఖజాంచి సంతోష్ ఆశీస్సులతో జిల్లా నుంచి ముగ్గురు టైక్వాండో విద్యార్థులు ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి పతకాలు తీసుకురావాలని అసోసియేషన్ ప్రతినిధులు ఆకాంక్షించారు.




