Sonala: బోథ్ విద్యాభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయి: తుల అరుణ్ కుమార్!
Sonala: బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) మంజూరైంది.
Sonala: బోథ్ విద్యాభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయి: తుల అరుణ్ కుమార్!
సోనాల: బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలానికి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' (TPS) మంజూరు కావడం పట్ల ఏఐసీసీ ఇంటెలెక్చువల్ సెల్ తెలంగాణ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీలకు అతీతంగా కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. సోనాల మండల ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని, ఈ నిర్ణయం గ్రామీణ, గిరిజన ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ బోథ్ విద్యాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ విద్యాసంస్థ మంజూరుకు సహకరించిన సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాధవ్, బోథ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అడే గజేందర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




