Adilabad: ఆదిలాబాద్‌లో డీజీపీ సి.వి. ఆనంద్.. 300 నూతన సీసీటీవీ కెమెరాలు ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 10 Jun 2026 11:29 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో డీజీపీ సి.వి. ఆనంద్.. 300 నూతన సీసీటీవీ కెమెరాలు ప్రారంభం!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ మరియు విచారణను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ చేతుల మీదుగా స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలలో 220 సీసీటీవీ కెమెరాలు గ్రామీణ ప్రాంతాలలో, 80 సీసీటీవీ కెమెరాలు పట్టణ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రారంభించారు సివి ఆనంద్..ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో డీజీపీ పాల్గొన్నారు. ఆయన వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, మల్టీజోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story