Talamadugu: తలమడుగులో పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన!

Talamadugu: విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతుల వినూత్న నిరసన.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 Sept 2026 12:52 PM IST
Talamadugu
X

Talamadugu: తలమడుగులో పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన!

Talamadugu: విద్యుత్ కోసం రైతుల నిరసన పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.. అదిలాబాద్ జిల్లా తలమడుగు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు.

పంట పొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలకు కొట్టుకుపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే, సాగునీటి వసతి ఉన్న రైతులు పంటలకు నీళ్లు అందించాలంటే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story