Tandur: తాండూరు సిద్ధివినాయక లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి!
Tandur: తాండూరు సిద్ధివినాయక లాడ్జిలో అల్లాపూర్ గ్రామానికి చెందిన దశరథ రెడ్డి (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Tandur: తాండూరు సిద్ధివినాయక లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి!
Tandur: పట్టణంలోని సిద్ధివినాయక లాడ్జిలో తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి దశరధ రెడ్డి (50) మంగళవారం రోజున లాడ్జిలో అద్దెకు దిగాడు.. ప్రతిరోజు బయటికి వెళ్తూ వస్తున్నాడు.. శనివారం సాయంత్రం నుండి దశరథ రెడ్డి బయటికి రాకపోవడంతో లాడ్జి మేనేజర్ వారి సిబ్బందితో వెళ్లి చూడగా వ్యక్తిని పిలిచినప్పటికీ ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించి మృతుడు దశరథ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story




