Kagaznagar: విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు: నైపుణ్యాలను పెంపొందించుకోవాలి - షాహిన్ సుల్తాన
Kagaznagar: కాగజ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 రోజుల వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
Kagaznagar: విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు: నైపుణ్యాలను పెంపొందించుకోవాలి - షాహిన్ సుల్తాన
కాగజ్‌నగర్ : మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) కాగజ్‌నగర్‌లో ఈ నెల 25వ తేదీ వరకు 15 రోజులపాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షాహిన్ సుల్తాన మాట్లాడుతూ, విద్యార్థులు చిత్రలేఖనం, క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకొని వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి దేవాజీ మాట్లాడుతూ, మండలంలోని 100 మంది విద్యార్థులకు ఈ శిక్షణలో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చైర్‌పర్సన్‌ను శాలువా, పూల బొకేతో సన్మానించారు.




