Nirmal: మహాగాం పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!
Nirmal: నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాధాకృష్ణుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.
Nirmal: మహాగాం పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!
నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు యన్. కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సర్పంచ్ అప్పాల రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ వరపు కృష్ణమూర్తి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకరాజు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
Next Story




