Nirmal: పవిత్ర కలశ పూజలు.. మారుమోగిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం!
Nirmal: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
Nirmal: పవిత్ర కలశ పూజలు.. మారుమోగిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం!
నిర్మల్: దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిన 1000 పవిత్ర కలశాలలో ఒకటి దస్తూరాబాద్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంది. గ్రామస్తులు, భక్తులు ఈ కలశాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదుర్కొని, ఆలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
విశేష సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు పవిత్ర కలశాలను పంపగా.. అందులో ఒకటి ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చేరుకుంది.
ఈ పవిత్ర కలశాన్ని స్వాగతించేందుకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మంగళ హారతులు, ధూప దీప నైవేద్యాలతో కలశానికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ మహోత్సవంలో పాల్గొనడం తమకు లభించిన గొప్ప భాగ్యమని, చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.




