Adilabad: కరాటే నేర్చుకోవాలా.. ఖాకీల పర్యవేక్షణలో ఉచిత శిక్షణ

Adilabad: ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి.

ANNOJULA SRINIVAS  RAO
Updated on: 4 May 2026 10:19 AM IST
Adilabad
X

Adilabad: కరాటే నేర్చుకోవాలా.. ఖాకీల పర్యవేక్షణలో ఉచిత శిక్షణ

ఆదిలాబాద్ జిల్లా: పోలీసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు..స్తానిక ఏఆర్ పరేడ్ మైదానంతో పాటు జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని ఈ ఉచిత వేసవి శిక్షణ శిభిరాలు పోలీసులు – మీకోసం లో భాగంగా ప్రారంభమయ్యాయి..జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2 నుండి పదవ తరగతి పిల్లలకు యోగా, కరాటే, ఆర్చరి,తో పాటు వివిధ రకాల క్రీడల్లో సైతం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎస్పీ.

గతే యేడాది నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కు మంచి స్పందన రావడం తో మల్లీ రెండవ సారి కూడ నిర్వహిస్తున్నాట్లు, ఒక్కోచోట వందమందికి పైగా చిన్నారులు హాజరవుతున్నారని , మే 30 వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు ఉంటుందని అన్నారు ఎస్పీ.విద్యార్థుల క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సమ్మర్ క్యాంపు చివరి రోజు ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రాలు అందజేయడం ఎస్పీ అఖిల్ తెలిపారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story