Adilabad: ఉచిత వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం వాగ్దారిలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 Aug 2026 9:16 PM IST
Adilabad
X

Adilabad: ఉచిత వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్!

ఆదిలాబాద్: పోలీసులు మీకోసంకార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ నేరేడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాగ్దారి గ్రామంలో నిష్ణాతులైన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు.

ఈ శిబిరంలో దాదాపు 800 మంది ప్రజలకు ఆర్థోపెడిక్, డెంటల్, పీడియాట్రిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.అనంతరం నేరేడిగొండ, తర్ణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన 12 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.

ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, నేరస్థులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తున్న 20 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసి అభినందించారు.

గంజాయి, గుడుంబా వంటి మాదక వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, గంజాయి పండించడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, సేవించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం వారికి మంచి మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story