Adilabad: సరైన పత్రాలు లేని 250 వాహనాలు సీజ్ ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం నిర్వహించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 5 Aug 2026 9:52 AM IST
Adilabad
X

Adilabad: సరైన పత్రాలు లేని 250 వాహనాలు సీజ్ ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 250 వాహనాలు, మూడు బెల్టు షాపుల నుంచి మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని, నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అన్ని వివరాలు సరిచూసుకోవాలని సూచించారు. రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు, కొనుగోళ్లపై కఠిన చర్యలు ఉంటాయని, భద్రత కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story