Adilabad: గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు
Adilabad: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గుడుంబా స్థావరాలపై పోలీస్ ప్రత్యేక డ్రైవ్. 26 మందిపై కేసులు నమోదు, భారీగా నాటుసారా, బెల్లం ఊట స్వాధీనం.
Adilabad: గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు
అదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 26 మందిపై కేసులు నమోదు చేసి, 32.5 లీటర్ల గుడుంబా, 35 లీటర్ల బెల్లం వాష్ (అదనంగా 2 క్యాన్లు), 705 లీటర్ల కల్లు, స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
ఆదివాసి ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ప్రజలు గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లాలో మత్తు పదార్థాలు, గంజాయి, గుడుంబా నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
Next Story




