Adilabad: ఆదిలాబాద్‌లో రోడ్డు రోలర్‌తో 120 సైలెన్సర్లు ధ్వంసం!
Adilabad: ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 120 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
Adilabad: ఆదిలాబాద్‌లో రోడ్డు రోలర్‌తో 120 సైలెన్సర్లు ధ్వంసం!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన మోడిఫైడ్ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఇటీవల ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 120 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో నుజ్జు నుజ్జు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.
మోటారు వాహన చట్టాలను ఉల్లంఘించి వాహనాల్లో అక్రమ మార్పులు చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి, ఒరిజినల్ సైలెన్సర్లనే ఉపయోగించాలని సూచించారు. జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే సామాన్య ప్రజలు తమ వాహనాలకు పోలీస్ సైరాన్ వాడుతున్నారని, అనుమతి లేకుండా పోలీస్ సైరాన్ వాడుతున్న వ్యక్తి పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపారు.ఇంకా ఎవరైనా ఇలా పోలీస్ సైరాన్ వాడితే డయాల్ 100 కు గాని, స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలనీ తెలియజేశారు.




