Gudihathnoor: అనాథ చిన్నారులకు అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ఆడే జైపాల్
Gudihathnoor: గుడిహత్నూర్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ చిన్నారులకు ఆధార్ కార్డులు, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్న సామాజిక కార్యకర్త ఆడే జైపాల్.
Gudihathnoor: అనాథ చిన్నారులకు అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ఆడే జైపాల్
గుడిహత్నూర్: తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాథ పిల్లలకు సామాజిక కార్యకర్త, యువ నాయకుడు ఆడే జైపాల్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన లట్పటే జగన్నాథ్ కుమారుడు మారుతి, కోడలు గత సంవత్సరం క్రితం మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఆ చిన్నారులకు ఆధార్ కార్డులు రాక సుమారు ఒకటిన్నర సంవత్సరంగా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
ఈ సమస్యను కుటుంబ సభ్యులు ఆడే జైపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పిల్లలకు ఆధార్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేశారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఆ పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయం అందేలా చొరవ చూపారు. ప్రభుత్వ సహాయం పొందేందుకు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో, తన సొంత పనిగా భావించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పత్రాలను సమర్పించి మరణ ధ్రువీకరణ పత్రాలు అందేలా పూర్తి బాధ్యత తీసుకున్నారు.
తమ కష్టకాలంలో పెద్ద దిక్కుగా నిలిచిన జైపాల్ అన్న దేవుడిలా ఆదుకున్నారని పిల్లల కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే జైపాల్ మాట్లాడుతూ, ఓపిక ఉన్నంతవరకు మాత్రమే కాకుండా ఊపిరి ఉన్నంతవరకు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. పేద ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వే తనకు కొండంత బలమని, తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




