Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా శ్రావణి ఉపాకర్మ వేడుకలు!

Adilabad: ఆదిలాబాద్ శ్రావణి ఉపాకర్మ వేడుకలు స్థానిక తిరుపెల్లి రామాలయంలో వైభవంగా జరిగాయి. నూతన యజ్ఞోపవీత ధారణ మరియు సామూహిక హవనం నిర్వహణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 1:06 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా శ్రావణి ఉపాకర్మ వేడుకలు!

Adilabad: అదిలాబాదులోని వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణ్ సమాజ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణి ఉపాకర్మ కార్యక్రమం వైభవంగా సాగింది.. స్థానిక తిరుపెల్లి రామాలయం నిర్వహించిన ఈ కార్యక్రమం గణపతి పూజ, పుణ్యాహ వచనం తొ ఆరంభమైంది.దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన వైదిక క్రతువు చికిలి అగస్త్య శాస్త్రి, వశిష్ఠ నారాయణ శాస్త్రి ఘనాపాటి లు నిర్వహించారు.సామూహికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఋగ్వేదులకు, యజుర్వేదులకు వేర్వేరుగా క్రతువు చేయించారు.

నూతన యజ్ఞోపవీత ధారణానంతరం ప్రత్యేక హవనం నిర్వహించారు. ఉపనయనం అయిన ప్రతి బ్రాహ్మణుడు శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతాలను ధరించే కరువును ఉపాకర్మ అని అంటారు.

దాదాపు 40 మందికి పైగా పాల్గొన్నారూ.ఈ కార్యక్రమంలో వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి, సంఘం అధ్యక్షుడు రఘు జోషి, కోశాధికారి అరుణ్ శాస్త్రి, బ్రాహ్మణ్ సమాజ్ అధ్యక్షుడు అన్నో జుల సంతోష్, సమాజ్ సీనియర్లు అమోల్ దేష్పాండే, నిషికాంత్, సంజయ్ దేష్పాండే తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story