Adilabad: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి!

Adilabad: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఆగస్టు 3లోపు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆగస్టు 4న బస్ భవన్ ముట్టడిస్తామని టీజీఎస్‌ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం ఆదిలాబాద్‌లో హెచ్చరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 July 2026 2:05 PM IST
Adilabad
X

Adilabad: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి!

Adilabad: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిజిఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం అన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. 2013 పిఆర్సి ఏరియర్స్ పై ఆర్టీసీ యాజమాన్యం చెల్లించవలసిన పిఎఫ్ కంట్రిబ్యూషన్ ను పిఎఫ్ కమిషనర్ ఆఫీస్కు పంపిస్తే పీఎఫ్ పెన్షన్ పెరుగుతుందని.. కావున యాజమాన్యం త్వరగా పంపించాలని కోరారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఆగస్టు మూడో తేదీలోపు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆగస్టు 4న బస్సు భవన్ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బస్ భవన్ ముట్టడికి ఉమ్మడి జిల్లాల నుండి విశ్రాంతి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story