Adilabad: రాఖీ ఎఫెక్ట్: ప్రయాణికులతో గుడిహత్నూర్ బస్టాండ్ కిటకిట!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ బస్టాండ్ రాఖీ పండుగ తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

NAGULA SATISH, BOATH
Published on: 30 Aug 2026 4:46 PM IST
Adilabad
X

Adilabad: రాఖీ ఎఫెక్ట్: ప్రయాణికులతో గుడిహత్నూర్ బస్టాండ్ కిటకిట!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తర్వాత అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్ గుడిహత్నూర్ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. రాఖీ పండుగ ముగిసి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ, నేడు ఆదివారం సెలవు దినం కావడంతో బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి రాఖీ పండుగకు పుట్టిళ్లకు వెళ్లిన మహిళలు, కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణం కావడంతో బస్టాండ్ ప్రాంగణమంతా మళ్లీ జనసంద్రంగా మారింది.

​ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడిపించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఉట్నూర్, మంచిర్యాల వైపు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులు బస్టాండ్‌లోకి రాగానే జనం పోటీపడి ఎగబడుతుండటంతో తీవ్ర తోపులాట పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన రద్దీ కారణంగా సీట్లు దొరకడం అటుంచితే, కనీసం నిలబడేందుకు కూడా ఖాళీ లేకపోవడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల తాకిడి దృష్ట్యా ఈ మార్గాల్లో మరిన్ని బస్సు సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story