Adilabad: ఆదిలాబాద్‌లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మానవహారం రాస్తారోకో!

Adilabad: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆదిలాబాద్‌లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిరసన. ఎన్టీఆర్ చౌక్ వద్ద మానవహారం, రాస్తారోకో.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 9 Sept 2026 12:44 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మానవహారం రాస్తారోకో!

Adilabad: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కళాశాల నిర్వహణ భారంగా మారిందని ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story