Adilabad: ఇచ్చోడలో పోలీసుల 'కమ్యూనిటీ కాంటాక్ట్' తనిఖీలు!
Adilabad: ఇచ్చోడ మండలంలోని జోగిపేట్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు చేసి, సరైన పత్రాలు లేని 32 వాహనాలు, కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Adilabad: ఇచ్చోడలో పోలీసుల 'కమ్యూనిటీ కాంటాక్ట్' తనిఖీలు!
Adilabad: ప్రజల రక్షణ, భద్రతే ధ్యేయంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇచ్చోడ రూరల్ సీఐ సిహెచ్. రమేష్ తెలిపారు. మండలంలోని జోగిపేట్ గ్రామంలో 50 మంది పోలీస్ సిబ్బందితో శుక్రవారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కారుతో పాటు సుమారు ₹5,000 విలువైన 10 కలప దుంగలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు, గంజాయి, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నంబర్ ప్లేట్లు లేని దొంగ వాహనాలు కొనుగోలు చేయొద్దని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే 8712659944 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎస్ హెచ్ ఓ కే. నరేష్ కుమార్, ఎస్ఐలు శ్రీకాంత్, విక్రమ్, ఈశ్వర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




