Adilabad: ఆదిలాబాద్‌ తిరుపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

Adilabad: ఆదిలాబాద్‌ తిరుపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్. పత్రాలు లేని 165 వాహనాలు స్వాధీనం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని డీఎస్పీ హెచ్చరిక.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Aug 2026 11:10 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌ తిరుపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

Adilabad: ఆదిలాబాద్‌ తిరుపల్లి ప్రాంతంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 159 ద్విచక్ర వాహనాలు, ఐదు త్రిచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పి జీవన్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు, కొనుగోళ్లపై కఠిన చర్యలు ఉంటాయని.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గంజాయి సేవించిన, విక్రయించిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story