Adilabad: ఆదిలాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్ 24 గంటల్లోనే దొంగల ముఠా ఖేల్ ఖతం

Adilabad: ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 27 May 2026 3:18 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్ 24 గంటల్లోనే దొంగల ముఠా ఖేల్ ఖతం

ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం.. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసి 33 తులాల బంగారం, 71 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.. అదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాలో మూడు రోజుల వరుస చోరీలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఏ ఆర్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు... న్యూఢిల్లీకి చెందిన ఇద్దరు, మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు ముఠా గా ఏర్పడి అదిలాబాద్ పట్టణంలో ఇటీవలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో 6 కులాల బంగారంతో పాటు ఇతర ఆభరణాలు తోరైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం విచారణ చేపట్టామని, సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని, అదిలాబాదు చోరీ సంఘటన తర్వాత నిందితులు మొదట కామారెడ్డి జిల్లాలో, ఆ మరుసటి రోజు వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడ్డారని మొత్తం మూడు చోట్ల చోరీలకు పాల్పడి 33 తులాల బంగారం, 71 తులాల వెండి ఇతర ఆభరణాలు చోరీ చేసి అదిలాబాద్ పట్టణ మీదుగా పరార్ అవుతున్న తరుణంలో ట్రాక్ చేసి పట్టుకున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహత్యం తెలిపారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను త్వరలో పట్టుకోగలిగామని, పట్టుబడ్డ నిందితుల్లో ఒకరిపై మర్డర్ కేసు ఉందని, అదేవిధంగా మరో ఇద్దరు కూడా నేర ప్రవృత్తిని ఎంచుకొని వరుస చోరీలకు పాల్పడ్డారని తెలిపారు ఎస్పి.. ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇంట్లో కూడా సి సి టీవీ ల మార్చుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ, ఇదిలా ఉంటే వరంగల్ పట్టణంలో చోరీ జరిగి 24 గంటల లోపే అదిలాబాద్ జిల్లా ఎస్పీ స్పందించి చోరీ సొత్తును రికవరీ చేయడం.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story