Nirmal: దస్తూరాబాద్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనం!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. గర్భిణులు, బాలింతలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.

RAKESH N, KHANAPUR
Published on: 28 Aug 2026 2:14 PM IST
Nirmal
X

Nirmal: దస్తూరాబాద్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనం!

Nirmal: దస్తూరాబాద్ మండల కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు, దస్తురాబాద్ సెక్రెటరీ, అంగన్‌వాడీ సూపర్వైజర్, ఆశ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

చిన్న పిల్లలకు తల్లిపాలు అమృతం లాంటివని, అవి బిడ్డకు రోగనిరోధక శక్తిని అందిస్తాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. పుట్టిన ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని, దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story