Nirmal: TGEJAC మహా ధర్నా.. PRC, DA సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!
Nirmal: నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ముందు TGEJAC ఆధ్వర్యంలో మహా ధర్నా. 2వ పిఆర్సి, 6 డీఏలు, సీపీఎస్ రద్దుతో పాటు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఉద్యోగుల డిమాండ్.
Nirmal: TGEJAC మహా ధర్నా.. PRC, DA సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు TGEJAC ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ 2వ PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన EHSను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
అలాగే CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లులను ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.
లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు హెచ్చరించారు. ఈ మహా ధర్నాకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డి మారుకొండ రాము, బిజెపి నాయకులు రావుల రామనాథ్, సిపిఐ, సిపిఎం నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, కట్ల రాజన్న మద్దతు తెలిపారు.




