Nirmal: జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన నిర్మల్ విద్యార్థులు

Nirmal: హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో 5 బంగారం, 4 రజత, 4 కాంస్య పతకాలు సాధించిన నిర్మల్ జిల్లా విద్యార్థులు.

Venkata Thirumala
Published on: 11 Aug 2026 6:09 PM IST
Nirmal
X

Nirmal: జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన నిర్మల్ విద్యార్థులు

నిర్మల్ జిల్లా: గత ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 1st JSK National Open Karate Championshipలో నిర్మల్ విద్యార్థులు సత్తా చాటారు.

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన 1st JSK National Open Karate Championshipలో నిర్మల్ జిల్లా నుండి Alphores School, Bhashyam School, Vijaya School, Prince High Schoolలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నట్లు కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు తేజేందర్ సింగ్ భాటియా, నిర్మల్ జిల్లా కరాటే అధ్యక్షులు కొండాజి శ్రీకాంత్ తెలిపారు.

ఈ సందర్భంగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు 5 బంగారు పతకాలు , 4 రజత పతకాలు , 4 కాంస్య పతకాలు సాధించారు. వారికి ట్రైన్ చేసిన మాస్టర్ ఊరే శ్రీకాంత్ ను నిర్మల్ జిల్లా కరాటే అసోసియేషన్ వారు అభినందనలు తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకులు ఊరే శ్రీకాంత్, మనీషా, రిషికేశ్ తదితరులు పాల్గొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story