Adelli: ఆడెల్లి గ్రామంలో వనమహోత్సవం మొక్కలు నాటిన నిర్మల్ ఎస్పీ జానకి!

Adelli: నిర్మల్ జిల్లా ఆడెల్లి గ్రామంలో వనమహోత్సవం. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ జానకి పాల్గొన్న డీఎస్పీ శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారులు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 25 Aug 2026 2:21 PM IST
Adelli
X

Adelli: ఆడెల్లి గ్రామంలో వనమహోత్సవం మొక్కలు నాటిన నిర్మల్ ఎస్పీ జానకి!

Adelli: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆడెల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.06 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, సారంగాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్తో పాటు ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story