Nirmal: నిర్మల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ జానకి షర్మిల

Nirmal: నిర్మల్ జిల్లా ప్రజలకు ఎస్పీ డా. జి. జానకి షర్మిల వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 13 Sept 2026 7:31 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్ జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పండగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు.

వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.

విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. యువత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణకు నిర్మల్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL