Nirmal: పోలీసుల వీక్లీ పరేడ్.. ఫిట్‌నెస్‌పై జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Nirmal: నిర్మల్‌లో నిర్వహించిన పోలీసు వీక్లీ పరేడ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. సిబ్బంది ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కీలక సూచనలు ఇస్తూ పరేడ్‌ను పరిశీలించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 25 July 2026 11:14 AM IST
Nirmal
X

Nirmal: పోలీసుల వీక్లీ పరేడ్.. ఫిట్‌నెస్‌పై జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

నిర్మల్ జిల్లా:

యాంకర్ పార్ట్: నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లాలోని సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విధుల మధ్య సమయం దొరికినప్పుడల్లా వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఫిట్నెస్‌ను నిరంతరం కాపాడుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చన్నారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య లేదా విధులకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకొని, సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, రవీందర్, సత్యనారాయణ, దీపక్, కృష్ణ, సమ్మయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రామ్ నిరంజన్ రావు, శేఖర్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story